CJP స్ఫూర్తితో 'E20 జనతా పార్టీ'.. మోడీ సర్కార్‍పై కేజ్రీవాల్ మరో BIG మూవ్‍మెంట్!

by Prasad Jukanti |

E20 పెట్రోల్‌పై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ‘E20 జనతా పార్టీ’ ట్రెండింగ్ కాగా, ఆగస్టు 1న 'నేషనల్ టౌన్‌హాల్'కు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

CJP స్ఫూర్తితో E20 జనతా పార్టీ..  మోడీ సర్కార్‍పై కేజ్రీవాల్ మరో BIG మూవ్‍మెంట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్‍తో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరిన్ని పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు పురుడు పోస్తున్నాయి. నీట్ పేపర్ లీక్‍కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసేలా పోరాటం చేసిన సీజేపీ స్ఫూర్తితో తాజాగా మరో కేంద్ర మంత్రి టార్గెట్‍గా సోషల్ మీడియాలో E20 జనతా పార్టీ ట్రెండింగ్‍గా మారింది.ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో ఆదరణ పెరుగుతున్న తరుణంలో E20పై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన పిలుపు ఇచ్చారు. E20 పెట్రోల్‌పై పోరాటానికి దేశప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

నేషనల్ టౌన్‌హాల్ అగెనెస్ట్:

తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసిన కేజ్రీవాల్.. E20 అంశంపై వచ్చే శనివారం ఢిల్లీలోని కాన్సిట్యూషనల్ క్లబ్ లో 'నేషనల్ టౌన్ హాల్ అగెనెస్ట్ E20' కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. 1 ఆగస్టు 2026 (శనివారం) ఉదయం 11:30 గటంలకు జరగబోయే ఈ కార్యక్రమానికి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నవారంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీకి దూరంగా ఉన్నవారు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఇందుకోసం 8588833212 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేస్తే కార్యక్రమానికి ముందురోజు లింక్ పంపిస్తామన్నారు. దేశ యువత ఒక్కటై గళం విప్పడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు E20 అంశంపైనా దేశవ్యాప్తంగా ఒక్కటై స్వరం వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

రైట్ టు చూజ్:

ఇథనాల్ బ్లెండెట్ పెట్రోల్ కారణంగా తమ వాహనాలు దెబ్బతింటున్నాయని అనేక మంది వాహనదారులు సోషల్ మీడియాలో వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నా కేంద్రం మాత్రం E20 పెట్రోల్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. E20 పెట్రోల్ అత్యంత సురక్షితమైన, స్వచ్ఛమైన, ఆధునిక ఇంధనమని.. దీన్ని మళ్లీ పాత పద్ధతికి మార్చే ప్రతిపాదన ఏదీ లేదని ఇటీవలే పార్లమెంటు వేదికగా స్పష్టం చేసింది. ఓ వైపు తమ వాహనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం తమ ఆవేదన పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో E20 జనతాపార్టీ పేరుతో కొత్త సెటైరికల్ పార్టీ పుట్టుకువచ్చింది. ప్రభుత్వం పెట్రోల్ పంపుల్లో 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను (E0) అందుబాటులో ఉంచాలని, వాహనదారులకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే హక్కును (రైట్ టు చూజ్) కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ఊపందుకుంది.

మేము వ్యతిరేకం కాదు కానీ..:

తాము ఎథనాల్ కలిపిన E20 ఫ్యూయెల్‌కు పూర్తిగా వ్యతిరేకం కాదని అయితే దానికి ప్రత్యామ్నాయంగా 100 శాతం ప్యూర్ పెట్రోల్‌ను కూడా మార్కెట్‌లో అమ్మాలని పార్టీ స్పష్టం చేసింది. పెట్రోల్ బంకుల్లో ఏది E20, ఏది సాధారణ పెట్రోలో స్పష్టంగా తెలిపే లేబుల్స్ ఏర్పాటు చేయాలని E20 ఫ్యూయెల్ వల్ల మైలేజ్, ఇంజిన్ పనితీరు, మెయింటెనెన్స్ ఖర్చులపై పడే ప్రభావం పై ఆధారపడిన రీసెర్చ్ నివేదికలను ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. వాహనాల ఇంజిన్లపై దీర్ఘకాలికంగా E20 చూపించే ప్రభావంపై స్వతంత్ర పరిశోధనలు జరిపించాలని కోరుతోంది. .

Next Story