Kejriwal: బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరీనే.. కంగ్రాట్స్ రమేష్: కేజ్రీవాల్ విమర్శలు

by B.Srinivas |

ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.

Kejriwal: బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరీనే.. కంగ్రాట్స్ రమేష్: కేజ్రీవాల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరీ (Ramesh bidhuri)పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి రమేష్ బిధూరీనే అని త్వరలోనే బీజేపీ అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తుందని జోస్యం చెప్పారు. ‘రాబోయే రెండు రోజుల్లో రమేష్ పేరును సీఎం క్యాండిడేట్‌గా అధికారికంగా వెల్లడిస్తారని మాకు సమాచారం అందుతోంది. బీజేపీ సీఎం అయినందుకు ఆయనను అభినందిస్తున్నా. కానీ రమేష్ ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ పట్ల ఆయన కార్యాచరణ ఎంటో కూడా స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. తన పేరు అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఢిల్లీ ప్రజల ముందు బీజేపీ, ఆప్ సీఎం అభ్యర్థుల మధ్య చర్చ జరగాలన్నారు. మరోవైపు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ సీఎం ఎంపికను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌, ఆప్‌-ద’ వల్ల ఢిల్లీ ప్రజలకు మేలు జరగబోదని విమర్శించారు.

Next Story