- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)కు భారీ షాక్ తగిలింది. ద్వారకలో పార్టీకి సంబంధించిన భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలకు గాను కేజ్రీవాల్ సహా ఇతరులపై కేసు నమోదు చేయాలని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue court) పోలీసులను ఆదేశించింది. మార్చి 18 లోగా దీనిపై యాక్షన్ రిపోర్ట్ (Action Report) సమర్పించాలని తెలిపింది. 2019లో ద్వారకలో పెద్ద పెద్ద హోర్డింగ్ లను ఏర్పాటు చేశారని కేజ్రీవాల్‌పై ఆరోపణలున్నాయి. దీంతో కేజ్రీవాల్ సహా అప్పటి మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ (Gulab singh), ద్వారకా కౌన్సిలర్ నితికా శర్మ (Nithika sharma) లపై కేసు నమోదు చేయాలని పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే దీనిపై విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ దానిని తిరస్కరించగా పిటిషన్ దారుడు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేసును మళ్లి విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు పిటిషన్ ను స్వీకరించి కేసు ఫైల్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liqor scam) కేసులోనూ కేజ్రీవాల్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలుకు సైతం వెళ్లిన కేజ్రీవాల్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అంతేగాక యమునా నది నీళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను హర్యానాలోనూ కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. దీంతో ఇప్పటికే షాక్‌లో ఉన్న కేజ్రీవాల్‌కు తాజా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో భారీ ఎదురుదెబ్బ తాకినట్టు అయింది. అయితే తాజా పరిణామంపై ఆప్ స్పందించలేదు.






