Bengal CM: ముర్షిదాబాద్ హింసలో అమిత్ షా ప్రమేయం..!

by Shamantha N |
Bengal CM: ముర్షిదాబాద్ హింసలో అమిత్ షా ప్రమేయం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ముర్షిదాబాద్ హింసలో కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit Shah) హస్తం ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని.. ఇందుకోసం అమిత్‌ షా, బీఎస్‌ఎఫ్‌ (BSF) కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోని వదిలారని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అజెండా కోసం దేశానికి హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ.. అమిత్ షా ను నియంత్రించాలని అన్నారు.

బంగ్లాదేశీయుల ప్రమేయం

ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల ప్రమేయం ఉందని వర్గాలు తమకు తెలిపాయని దీదీ అన్నారు. ఈ అల్లర్లపై సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ముర్షిదాబాద్ హింసాకాండలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని మమత ప్రకటించారు. ఘర్షణల్లో బీఎస్‌ఎఫ్‌ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.



Next Story

Most Viewed