- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో (Uttarakhand) గత కొన్ని రోజులు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. నదులు పొంగిపొర్లటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ (Kedarnath) యాత్రను తాత్మాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడడంతో యాత్రికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తరువాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటన వచ్చేవరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.






