- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. ప్రధాని మోడీ పేరుపై తొలిపూజ!
by Satheesh |
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం 6:20 నిమిషాలకు వేదోచ్ఛరణ మధ్య ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్యం ఆలయ తలుపులు తెరిచారు. గత 72 గంటల నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో భీకరంగా మంచు కురిసింది. ప్రస్తుతం -6 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అయినా స్వామి దర్శనం కోసం వేల మంది భక్తులు బారులు తీరారు. ఆలయాన్ని తెరుస్తున్న సందర్భంగా 35 క్వింటాళ్ల పువ్వులతో సుందరంగా అలంకరించారు. అంతేకాకుండా, ఆలయ తలుపులు తెరిచే క్రమంలో భక్తులపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కేదార్‌నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోడీ పేరు మీద తొలి పూజ చేసినట్లు తెలిపారు.
Next Story






