- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kashmir: కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి.. పాక్ పార్లమెంటులో తీర్మానం !
పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని భారత్‌ను కోరుతూ ఆ దేశ పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ (Pakisthan) మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని భారత్‌ను కోరుతూ ఆ దేశ పార్లమెంటులో మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కశ్మీర్ వ్యవహారాల మంత్రి అమీర్ ముఖాం (Ameer mukham) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ‘కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్థాన్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు అందిస్తుంది’ అని రెసల్యూషన్‌లో పేర్కొంది. అంతేగాక దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం చాలా అవసరమని తెలిపింది. కాగా, 2019 ఆగస్టు 5న, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.






