- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actor Vijay: కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ ముందు హాజరైన టీవీకే చీఫ్ విజయ్
అనంతరం విజయ్ న్యూఢిల్లీలోని సీబీఐ కార్యాలయం నుంచి తిరుగు పయనం అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్, కరూర్ తొక్కిసలాట కేసు విచారణకు సంబంధించి సోమవారం సీబీఐ ముందు హాజరయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు విచారణ అనంతరం విజయ్ న్యూఢిల్లీలోని సీబీఐ కార్యాలయం నుంచి తిరుగు పయనం అయ్యారు. ఉదయం 11.29 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, అంతకుముందు టీవీకే పార్టీ తమ నేతకు సరైన భద్రత కల్పించాలని కోరిన నేపథ్యంలో సీబీఐ కార్యాలయం ఎదుట భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. నటుడు విజయ్ మద్దతుదారులు భారీ సంఖ్యలో వస్తారని ఊహించి, ఎలాంటి నిరసనలు జరగకుండా నిరోధించడానికి సీబీఐ కార్యాలయ భవనం చుట్టూ కూడా ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. విజయ్‌తో పాటు ఈ కేసులో సీబీఐ పలువురు టీవీకే నిర్వాహకులను కూడా ప్రశ్నించింది. అధికారుల ప్రకారం, ఈ కేసులో తమిళనాడు మాజీ ఏడీజీ, శాంతిభద్రతల విభాగం అధికారి ఎస్. డేవిడ్‌సన్ దేవసిర్వాథమ్‌కు కూడా సీబీఐ సమన్లు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సిట్ నుంచి ఈ కేసును స్వీకరించి, తొక్కిసలాటకు సంబంధించిన సాక్ష్యాలను సేకరిస్తోంది. కాగా, గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో నటుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.






