- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరూర్ తొక్కిసలాట కేసు.. దళపతి విజయ్కి CBI నోటీసులు
తమిళనాడులోని కరూర్‌లో గత ఏడాది సెప్టెంబర్ 27 జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను స్పీడప్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ (Karur)లో గత ఏడాది సెప్టెంబర్ 27 జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణను స్పీడప్ చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ (Thalapathy Vijay)కి ఇవాళ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ (Dehli)లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, హీరో విజయ్ టీవీకే పార్టీ కరూర్‌లోని వేలుసామిపురం (Velusamipuram)లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (Justice Ajay Rastogi) నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.






