- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్ నేత
by Vinod kumar |
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్ తగిలింది.

X
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రధాన లింగాయత్ నేత హెచ్‌డీ తమ్మయ్య కమలాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖ సమర్పించిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చిక్కమగలూరు కు చెందిన తమ్మయ్య బీజేపీ కీలక నేత సీటీ రవికి ఆప్తుడిగా పేరొందారు. తాజాగా బీజేపీ లో చోటు చేసుకున్న పరిణామాలు తనకు అసంతృప్తిని కలిగించినట్లు చెప్పారు.
ఈ కారణంగానే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 17 ఏళ్ల పాటు పార్టీలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతూ రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆధ్వర్యంలో హస్తం లోకి చేరారు. చాలా మంది బీజేపీ నేతలు తనకు టచ్‌లో ఉన్నారని, త్వరలోనే మరికొందరు చేరుతారని శివకుమార్ చెప్పారు.
Next Story






