18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత: కర్ణాటక స్పీకర్

by Phanindra |

రెండు నెలల క్రితం సస్పెండ్ చేసిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు కర్ణాటక స్పీకర్ ప్రకటించారు. ఆ నేతలు తమ శత్రువులు కాదన్నారు.

18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత: కర్ణాటక స్పీకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: 18 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ వెల్లడించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, విపక్ష నేత ఆర్ అశోక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌తో సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ఖాదర్ ప్రకటించారు. మార్చి 21న అసెంబ్లీలో అమర్యాదగా ప్రవర్తించినందుకు, స్పీకర్‌ను అవమానించినందుకు 18 మంది బీజేపీ ఎమ్మేల్యను సస్పెండ్ చేశారు. ‘నేను ఈ సస్పెన్షన్ ప్రతిపాదించినా.. దీన్ని ఆమోదిస్తూ సభ కూడా తీర్మానం చేసింది. ఈ క్రమంలో సభాపక్ష నేత, డిప్యూటీ సీఎం, విపక్ష నేత, న్యాయ శాఖ మంత్రి, నేను ఈ విషయంపై చర్చించాం. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి ఆ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించాలని నిర్ణయించాం’ అని ఖాదర్ తెలియజేశారు. సదరు ఎమ్మెల్యేలపై ఎలాంటి షరతులు పెట్టలేదని, వారు తమ శత్రువులేం కాదని ఆయన చెప్పారు.

Next Story