కర్నాటక రిజల్ట్: భారీ అధిక్యంలో కాంగ్రెస్.. ముందంజలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

by Disha Web Desk 19 |
కర్నాటక రిజల్ట్: భారీ అధిక్యంలో కాంగ్రెస్.. ముందంజలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన కర్నాకట అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్, ఈవీఎంల మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగా.. కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో దూసుకుపోతుంది. మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవసరమయ్యే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాంగ్రెస్ ప్రముఖులు సిద్ధారామయ్య, డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే ముందంజలో ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో జేడీఎస్2కు కర్నాటక ఓటర్లు షాకిస్తున్నారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. కింగ్ మేకర్‌గా మారుతుందనుకున్న జేడీఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి.

Next Story

Most Viewed