- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రిమినల్ కేసులు వెనక్కు తీసుకోవడం అన్యాయం: కర్ణాటక హైకోర్టు
క్రిమినల్ కేసులు వెనక్కు తీసుకోవడం అన్యాయం అని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో నమోదైన 43 క్రిమినల్ కేసులను వెనక్కు తీసుకోవాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుల్లో 2022 హుబ్బలి అల్లర్లకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఇలా కేసులు వాపస్ తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ.. బెంగళూరుకు చెందిన ఒక అడ్వకేట్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ కేవీ అరవింద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు.. రాజకీయ నేతలు, పరపతి ఉన్న వ్యక్తులపై ఉన్న కేసులను వెనక్కు తీసుకోవడం అన్యాయంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. పలు కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండగా ఇలా అర్ధంతరంగా కేసులు వెనక్కు తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలను అంగీకరిస్తే అది న్యాయవ్యవస్థ నిజాయితీని తక్కవ చేస్తుందని పేర్కొంది.
సాధారణంగా ఇలా కేసులు వెనక్కు తీసుకునే ప్రక్రియను చట్టప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మాత్రమే ప్రారంభించాలి. అయినా సరే ప్రాసిక్యూషన్ విభాగం అభ్యంతరాలను పక్కన పెట్టిన ప్రభుత్వం.. ఈ క్రిమినల్ కేసులు వెనక్కు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, పోలీసులపై దాడులు.. వంటి ప్రమాదకరమైన కేసులను ప్రభుత్వం వెనక్కు తీసుకున్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపారు.






