- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karnataka: గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్.. విజయోత్సవ ర్యాలీ.. వీడియో వైరల్
గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన(Victory Procession) ఘటన వివాదాస్పదంగా మారింది. కర్ణాటకలోని హవే జిల్లాలో ఈ ఘటన జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన(Victory Procession) ఘటన వివాదాస్పదంగా మారింది. కర్ణాటకలోని హవే జిల్లాలో ఈ ఘటన జరిగింది. గతేడాది జనవరిలో జిల్లాలోని ఓ హోటల్ గదిలో ఉన్న ఓ జంటపై కొందరు దాడి చేశారు. మహిళను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగు ప్రధాని నిందితులు సహా మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, పది నెలల క్రితమే 12 మంది బెయిల్ పై విడుదలయ్యారు. కాగా.. మరో ఏడుగురు ప్రధాన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే, ఈ ఏడుగురు నిందితులకు హవేరి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు హవేరిలోని అక్కి ఆలూర్ పట్టణం (Akki Alur town)లో ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. బైక్‌లు, కార్లతో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా కారు సన్‌రూఫ్ నుంచి నిందితులు బయటకు వచ్చి కేకలు వేస్తూ, విజయ సంకేతాలు తీస్తూ ర్యాలీ తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.






