- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLAకు నామినేషన్ వేసిన యాచకుడు
by Sathputhe Rajesh |
కర్ణాటక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో యాచకుడు నిలవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతున్నాడు. గురువారం నామినేషన్ సమర్పించాడు. డిపాజిట్ కింద రూ.10వేలు చెల్లించాడు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్ డబ్బుల కోసం బిక్షాటన చేశాడు. చిల్లరనే నామినేషన్ స్వీకరిస్తున్న అధికారులకు ఇచ్చాడు. 2 గంటల కష్టపడి అధికారులు చిల్లరను లెక్కించి నామినేషన్ స్వీకరించినట్లు తెలిపారు. తన పోటీకి గల కారణాన్ని ప్రజలకు ఇప్పటికే చెప్పినట్లు యంకప్ప తెలిపారు.
Next Story






