- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ స్పీకర్ కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
కర్ణాటక బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి మణిపాల్ ఆసుపత్రి

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 56 సంవత్సరాల ఆనంద్ మమణికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆనంద్ సవదత్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత కొన్నిరోజులుగా బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్ మమణి గతకొన్ని రోజులుగా కోమాలో ఉన్నారు. కాగా, మమణి మృతి పట్ల కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. బెలగావిలోని సౌందట్టి ఎలమ్మ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మమణి, 1990లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇయన దివంగత చంద్రశేఖర్ మల్లికార్జున మమని కుమారుడు. 2008లో మమణి బీజేపీలో చేరారు. 2020 మార్చిలో శాసనసభ 24వ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.






