- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడిన డిప్యూటీ సీఎం.. బీజేపీలో చేరడం పై క్లారిటీ
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో డీకే శివకుమార్ (DK Sivakumar) హాట్ టాపిక్‌గా మారింది. మొదటి నుంచి సీఎం పదవి (CM post)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ప్రవర్తన భిన్నంగా ఉండటంతో సీఎం పదవి కోసమే పార్టీ మారుతున్నారని నిత్యం ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన వాటిని ఖండిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా ఆర్ఎస్ఎస్ గీతా (RSS anthem)న్ని ఆలపించడంతో మరోసారి పార్టీ మార్పు రూమర్లకు బలం చేకూరింది. అలాగే నిండు సభలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని పఠించడంపై వివాదం నెలకొంది. ఆయన ప్రవర్తనను కాంగ్రెస్ నేతలు తప్పుబట్టగా బీజేపీ నేతలు మాత్రం సమర్ధించారు. దీంతో డిప్యూటీ సీఎం శివ కుమార్ పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం మళ్లీ మొదలైంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం డీకే శివకుమార్ స్పందిస్తూ.. బీజేపీలో చేరడం (Joining BJP) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో చేతులు కలిపే ఊహాగానాలను ఖండించారు. "తాను నిజమైన కాంగ్రెస్ వాదిని. పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. నేను బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ వాదినే. నా జీవితం, నా రక్తం అంతా కాంగ్రెస్ కోసమే. నేను ఇప్పుడు పార్టీని నడిపిస్తున్నాను" అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. " అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా చేతులు కలిపే ఉద్దేశ్యం తనకు లేదని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విద్యాసంస్థలను నిర్మించడంలో ఆర్‌ఎస్‌ఎస్ పెట్టుబడులు పెడుతోందని ఆయన అన్నారు. "ప్రతి రాజకీయ పార్టీపై తాను స్వంత పరిశోధన చేశానని. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ తన సంస్థను ఎలా నిర్మించిందో తనకు తెలుసని, ప్రతి తాలూకా, జిల్లాతో సహా ప్రతిచోటా ఆర్‌ఎస్‌ఎస్ విద్యా సంస్థలను తన విభాగంలోకి తీసుకుంటోందని ఈ సందర్భంగా డీకే శివకుమార్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో చెప్పుకొచ్చారు.






