ఆరుగురు RCB అభిమానులు మృతి.. క్షమాపణ చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం DK

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-04 12:36:15  IST  )

బెంగళూరులోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో ఐపీఎల్ 18వ సీజన్ కప్ గెలిచిన ఆర్సీబీ(Royal Challengers Bengaluru) ప్లేయర్లకు సన్మానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఆరుగురు RCB అభిమానులు మృతి.. క్షమాపణ చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం DK
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి మైదానం(Chinnaswamy Stadium)లో ఐపీఎల్ 18వ సీజన్ కప్ గెలిచిన ఆర్సీబీ(Royal Challengers Bengaluru) ప్లేయర్లకు సన్మానం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే.. సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. గేట్లు ఓపెన్ చేయగానే ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు పరుగులు తీశారు. బారికేడ్లను సైతం తోసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఆరుగురు ఆర్సీబీ అభిమానులు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) స్పందించారు. మృతుల కుటుంబాలకు క్షమాపన చెప్పారు. అభిమానులు భారీ ఎత్తున రావడంతో అదుపుచేయలేకపోయామని అన్నారు. ఇంతటి విషాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోవైపు స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన అభిమానులకు బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆసుపత్రి వద్దకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేరుకున్నారు.

Next Story