PCC చీఫ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు

by Disha Web Desk 19 |
PCC చీఫ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గద్ద ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్‌కు గద్ద ఢీకొట్టడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. దీంతో పెను ముప్పును తప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ములాబాగిలు వెళ్తుండగా హోసకోటే వద్ద హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో పైలట్ దానిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ గ్లాస్ విరిగి పోగా, డీకే శివకుమార్ కెమెరామన్‌, పైలెట్‌ స్వల్పంగా గాయపడ్డారని కాంగ్రెస్ వెల్లడించింది.

Next Story

Most Viewed