అన్నభాగ్య లబ్దిదారులకు ‘డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ ఫర్’ను ప్రారంభం

by Dishafeatures2 |
అన్నభాగ్య లబ్దిదారులకు ‘డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ ఫర్’ను ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఐదు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఒకటైన 'అన్నభాగ్య' పథకాన్ని జులై 1వ తేదీ నుండి అమలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని తెలిపింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోలకు సమానమైన మొత్తాన్ని బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పును కిలోకి రూ.170 రూపాయలు చెల్లిచనున్నారు. కాగా తాజాగా బియ్యానికి బదులుగా నగదు బదిలీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆహార మంత్రి మునియప్ప ప్రారంభించారు. బియ్యం కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

Next Story

Most Viewed