కులగణనకు తెలంగాణను ఆదర్శంగా తీసుకోండి : సీఎం సిద్ధరామయ్య

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంకల్పం వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొగ్గిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) అన్నారు.

కులగణనకు తెలంగాణను ఆదర్శంగా తీసుకోండి : సీఎం సిద్ధరామయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంకల్పం వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొగ్గిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) అన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులసర్వేను (Telangana Census) ఆదర్శంగా తీసుకుని కులగణన చేపట్టాలని కేంద్రానికి సూచించారాయన. ప్రతిపక్ష పార్టీలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కుల ఆధారిత జనాభా గణనను నవీకరించాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కులగణన కేవలం వర్గాలను లెక్కించేందుకే కాదని, వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ పరిస్థితులపై వివరణాత్మక డేటాను కలిగి ఉండాలన్నారు. అంతకుముందు బెంగళూరులో నిర్వహించిన తొలి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) OBC సలహా మండలి సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాజకీయాలు, విద్య మరియు ఆర్థిక వ్యవస్థలో వెనుకబడిన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించకపోతే భారతదేశ ప్రజాస్వామ్యం అసంపూర్ణంగా ఉంటుందని అన్నారు. భారతదేశంలో పూర్తి కులగణన 1931లో జరిగింది. 2011లో జరిగిన సామాజిక-ఆర్థిక, కులగణన (SECC)లో పరిమిత డేటా సేకరించబడినప్పటికీ, దాని ఫలితాలను వెల్లడించలేదు.

Next Story