Karnataka Budget: సినిమా టికెట్లపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Shamantha N |

సినిమా లవర్స్ కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. కర్ణాటక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

Karnataka Budget: సినిమా టికెట్లపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: సినిమా లవర్స్ కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. కర్ణాటక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే, ఈ సమావేశాల్లో సినిమా రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కర్ణాటకలోని అన్ని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్‌లలో సినిమా టికెట్ ధ‌ర‌ను రూ.200కి పరిమితం చేస్తున్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్ర‌క‌టించారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం.. మల్టీప్లెక్స్‌లలో సాధారణ సీట్లకు టికెట్ ధర రూ.200 దాటకూడదు. అయితే గోల్డ్ క్లాస్ స్క్రీన్‌లు, గోల్డ్ క్లాస్ సీట్లకు ఈ పరిమితి వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా, కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు మల్టీప్లెక్స్‌లలో కన్నడ, తులూ అలాగే ప్రాంతీయ చిత్రాలను ప్రైమ్ టైమ్‌లో ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, కన్నడ సినిమాల ప్రచారం కోసం ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంని కూడా త‌క్కువ ధ‌ర‌లో ప్ర‌భుత్వం తీసుకురాబోతున్న‌ట్లు తెలుస్తుంది.

కన్నడ ప్రముఖులు

కన్నడ నటులు రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి సహా పలువురు నిర్మాతలు, నటులు ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కన్నడ కంటెంట్‌పై తగినంత ఆసక్తి చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కర్ణాటక సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కన్నడ వెబ్ సిరీస్ కోసం రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరమవా స్టూడియో ఓటీటీ అగ్రీమెంట్ ని పొందలేకపోయింది. ఆ కన్నడ వెబ్ సిరీస్ కోసం గతేడాది జులైలో సొంత స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం ప్రారంభించడ గమనార్హం.

Next Story