- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dharmasthala case: ధర్మస్థల మాస్ గ్రేవ్ కేసుపై బీజేపీ పోరాటం! ‘ఛలో ధర్మస్థల’ యాత్ర ప్రారంభం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల మాస్ గ్రేవ్ కేసు వ్యవహారంపై బీజేపీ పోరాటానికి సిద్దమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల మాస్ గ్రేవ్ కేసు వ్యవహారంపై బీజేపీ పోరాటానికి సిద్దమైంది. ఈ మేరకు కర్ణాటకలో (Karnataka BJP) బీజేపీ ‘ఛలో ధర్మస్థల’ (Dharmasthala Chalo) కార్యక్రమం ప్రారంభించింది. ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేలా కుట్ర సాగుతోందని 17 వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఇవాళ (శనివారం) యలహంక ఎమ్మెల్యే ఆర్. విశ్వనాథ్ నేతృత్వంలో నెలమంగళ టోల్ నుంచి ధర్మస్థల వరకు వందల వాహనాల కాన్వాయ్‌లతో యాత్రను ప్రారభించారు. అక్కడికి చేరుకున్నాక మంజునాథ స్వామి దర్శనం చేసుకుని ఆలయ పవిత్రతను భంగం కలిగిస్తున్న దుష్టులను శిక్షించాలని ప్రత్యేక పూజలు చేసి.. మరుసటి రోజు వెనుతిరిగి వస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వనాథ్ మాట్లాడుతూ.. మేము 300 కార్లలో ధర్మస్థలానికి ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మస్థలపై యూట్యూబర్లు, మీడియా వర్గాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి చలో ధర్మస్థల యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. సాయంత్రం నాటికి ధర్మస్థలకు చేరుకుంటామని తెలిపారు. రేపు (ఆదివారం) బీజేపీ స్టేట్ చీఫ్, ఎమ్మెల్యే బీవై. విజయేంద్రతో పాటు 35 నుంచి 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని చెప్పుకొచ్చారు.






