- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karge: మోడీ దేశాన్ని అమ్మేయడం ఖాయం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఏదో ఒక రోజు దేశాన్ని అమ్మి వెళ్లిపోతారని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఏదో ఒక రోజు దేశాన్ని అమ్మి వెళ్లిపోతారని ఆరోపించారు. ఇప్పటికే మైనింగ్ నుంచి విమానాశ్రయాలకు వరకు ప్రతిదీ తన స్నేహతులైన పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్నారని కాబట్టి దేశాన్ని సైతం ఏదో ఒకరోజు అమ్మేస్తారని మండిపడ్డారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. దేశంలోని కీలక వనరులు పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్నారని ఇది జాతీయ భద్రతకు ఎంతో ప్రమాదమని హెచ్చరించారు. ‘ధనవంతులు విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువతను బంధించి వెనక్కి పంపుతున్నారు. అయినప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు’ అని విమర్శించారు. మోడీ హయాంలో ఎన్నికల కమిషన్ సహా ఏ సంస్థకూ భద్రలేదన్నారు. ఎన్నికల్లో మోసం జరుగుతోందని అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పత్రాలు ఉపయోగిస్తున్నప్పిటీ భారత్‌లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నారన్నారు.
ఉద్దేశపూర్వకంగానే కులగణనను వ్యతిరేకిస్తున్నారు: రాహుల్
దేశంలో మైనారిటీల వాస్తవ వాటాను దాచడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఉద్దేశపూర్వకంగానే కుల గణనను వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో కుల గణన నిర్వహించినట్టు దేశ వ్యాప్తంగా చేస్తామన్నారు. వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. ఇది ముమ్మాటికీ మత స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అని ఆరోపించారు. బీజేపీ దేశ రాజ్యాంగాన్ని కాలరాస్తోందని ఫైర్ అయ్యారు. సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ లొంగిపోయారన్నారు. కొత్త సుంకాలు విధించినా మౌనంగానే ఉన్నారని తెలిపారు.
న్యాయ్ పథ్ తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్
ఏఐసీసీ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పథ్ అనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ప్రకారం.. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు విజయం సాధించడానికి పార్టీ అనుమతించదు. ఏకకాల ఎన్నికలు వంటి సమాఖ్య నిర్మాణంపై జరిగే ప్రతి దాడిని ఎదుర్కొంటామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ పై చట్టం చేయడంతో పాటు వారికి జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయింపులకు హామీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలిపింది.






