- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karge: 11 ఏళ్లలో 33 తప్పులు చేశారు.. మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjuj karge) విమర్శలు గుప్పించారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోడీ 33 తప్పులు చేశారని ఆరోపించారు. మోడీ కేవలం ఓట్ల రాజకీయాలకు మాత్రమే పాల్పడుతున్నారని, నిరంతరం అబద్దాలు చెబుతూ యువతను, పేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. బుధవారం ఆయన కర్ణాటక (Karnataka)లోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. ఈడీ దాడులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. అంతేగాక కాంగ్రెస్ లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ (Deputy speaker) పదవి ఖాళీగా ఉంచడంపై స్పందిస్తూ.. మోడీ ప్రతిపక్షాలకు చిన్న పదవి కూడా ఇవ్వడం లేదని, దీనిని బట్టి చూస్తే ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని, సీఎం సిద్ధరామయ్య (Sidda Ramaiah) రిజైన్ చేయాలని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.






