Karge: బీజేపీ అసమర్థత వల్లే మణిపూర్‌లో సంక్షోభం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by B.Srinivas |

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Karge: బీజేపీ అసమర్థత వల్లే మణిపూర్‌లో సంక్షోభం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ అసమర్ధత వల్లే రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి పాలనతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘11 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నది బీజేపీనే. అలాగే రాష్ట్రంలోనూ ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కాషాయ పార్టీదే. జాతీయ భద్రత, సరిహద్దు గస్తీని రక్షించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. కానీ రాష్ట్రపతి పాలన విధించి సొంత పార్టీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడం మణిపూర్ ప్రజలను మీరు ఎలా విఫలం చేశారో ప్రత్యక్షంగా తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు. మోడీ వెంటనే మణిపూర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిందని పేర్కొన్నారు.

Next Story