- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannada: కన్నడ భాషపై మాట్లాడొద్దు.. కమల్ హాసన్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్‌కు బెంగళూరులోని సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal hasan) కు బెంగళూరులోని సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. కన్నడ భాషకు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిషేధించింది. ఈ మేరకు తాజాగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కమల్ హాసన్ కన్నడ భాష, సాహిత్యం, సంస్కృతికి వ్యతిరేకంగా, కించపరిచే ఎలాంటి ప్రకటనలు చేయకూడదని కోర్టు పేర్కొంది. కన్నడ సాహిత్య పరిషత్ (KNP) అధ్యక్షుడు మహేష్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది. కాగా, ఇటీవల జరిగిన థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.






