ఎంపీ బరిలో కంగనా రనౌత్, అక్షయ్ కుమార్!.. సినీ సెలబ్రెటీలకు బీజేపీ బంపరాఫర్

by Disha Web Desk 13 |
ఎంపీ బరిలో కంగనా రనౌత్, అక్షయ్ కుమార్!.. సినీ సెలబ్రెటీలకు బీజేపీ బంపరాఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ స్పీడు పెంచింది. ఈసారి ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధించడమే టార్గెట్ గా ప్రధాని మోడీ టీమ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఏ క్షణమైనా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించబోతున్న కమలం పార్టీ.. ఈ జాబితాలో ఎవ్వరూ ఊహించని కొత్త ముఖాలకు ఛాన్స్ కల్పించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈసారి బాలీవుడ్ ప్రముఖ యాక్టర్స్ కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ లను బరిలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అనౌన్స్ చేయబోయే తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు ఉండనున్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో టాక్ వినిపిస్తోంది.

మండి నుంచి కంగనా, చాందినీ చౌక్ నుంచి అక్షయ్!:

అలాగే వీరిద్దరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, అక్షణ్ కుమార్ లు వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుండటంతో వీరి రాజకీయ రంగ ప్రవేశంపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సినీతారలను బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం వేళ ఇటీవల కంగనా రనౌత్ స్పందిస్తూ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయం అనే టాక్ నేషనల్ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి కంగనా, ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అక్షయ్ కుమార్ లను నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టాలీవుడు సెలబ్రెటికీ ఛాన్స్?:

హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ పార్టీ ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఫస్ట్ లిస్ట్ పై ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతల మధ్య డిస్కషన్ జరిగింది. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా కమలనాథులు తీవ్ర మోదోమదనం చేశారు. ఈ మేరకు తొలిజాబితాను సిద్ధం చేసిన అధిష్టానం తొందరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రధాని మోడీ, అమిత్ వంటి ముఖ్యనేతల పేర్లతో పాటు కొత్తముఖాలు ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి సైతం సినీరంగానికి చెందిన ఓ టాప్ ప్రొడ్యూసర్ తో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని అన్ని సజావుగా జరిగితే రాష్ట్రంలోనూ బీజేపీ తరపున ఓ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అభ్యర్థిగా ఉండబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story