- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kamal hasan: సభలకు వచ్చే జనమంతా ఓటేయరు.. ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్
by B.Srinivas |
బహిరంగ సమావేశాలకు వచ్చే జనమంతా ఓట్లు వేయబోరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ అన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: బహిరంగ సమావేశాలకు వచ్చే జనమంతా ఓట్లు వేయబోరని మక్కల్ నీది మయ్యం (MNM) చీఫ్, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ (Kamal hasan) అన్నారు. తమిళనాడులోని చెన్నయ్ లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ భారీగా ప్రజాకర్షణ చేస్తున్నారని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒక నాయకుడు భారీ జనాన్ని ఆకర్షించినంత మాత్రాన వారంతా ఓటు వేయరని తెలిపారు. ఈ రూల్ విజయ్‌కే గాక దేశంలోని లీడర్లందరికీ వర్తింస్తుందని చెప్పారు. విజయ్ ధైర్యంగా ముందుకు సాగాలని సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆయన సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ పై వ్యాఖ్యలు చేశారు.
Next Story






