- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mansarovar : ఐదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న మానససరోవర యాత్ర
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం కానున్నది. ఈ యాత్రకు సన్నాహాలు జోరందుకున్నాయి. త్వరలోనే దీనిపై ప్రజానోటీసు జారీ చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం కానున్నది. ఈ యాత్రకు సన్నాహాలు జోరందుకున్నాయి. త్వరలోనే దీనిపై ప్రజానోటీసు జారీ చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. చైనాతో సంప్రదింపుల తర్వాత యాత్ర కోసం మార్గాలను తిరిగి రూపొందించడాన్ని పరిశీలిస్తుందని జైస్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. మానస్ సరోవర్‌కు మూడు మార్గాలు ఉన్నాయి. ఆయా మార్గాల గుండా ప్రయాణానికి దాదాపు 14 రోజుల నుంచి గరిష్ఠంగా 21 రోజుల సమయం పడుతుంది. సముద్ర మట్టానికి కైలాస మానసరోవరం 22వేల అడుగుల ఎత్తుల ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కింలోని నాథులా నుంచి 802 కిలోమీటర్లు, ఇక మూడు మార్గమైన నేపాల్ రాజధాని కాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, యాత్రలో పాల్గొనే పర్యాటకులంతా వందశాతం ఫిట్‌గా ఉంటే మాత్రమే ప్రయాణం చేయాలి. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.
కైలాస పర్వతం..
కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్‌లో ఉంది. ఏటా వేలాది మంది కైలాస, మానస సరోవర యాత్రలో పర్యాటకులు పాల్గొనేవారు. ఈ యాత్ర కరోనా మహమ్మారి కారణంగా 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. పలు దఫాలుగా చర్చల తర్వాత.. యాత్ర పునరుద్ధరించడంతో పాటు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక త్వరలోనే ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించనున్నారు. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్ర ఇప్పుడు ప్రారంభం కానుంది.






