రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్ గురించి ఏమీ తెలియ‌దు: కే.ఏ.పాల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-13 11:08:48  IST  )

కేంద్ర ఏవియేష‌న్ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు (Rammohan nayudu) వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(Ka Paul) డిమాండ్ చేశారు.

రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్ గురించి ఏమీ తెలియ‌దు: కే.ఏ.పాల్
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర ఏవియేష‌న్ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు (Rammohan nayudu) వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(Ka Paul) డిమాండ్ చేశారు. అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంపై పాల్ స్పందించారు. మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రామ్మోహ‌న్ నాయుడుకు ఎలాంటి అనుభవం లేద‌ని మండిప‌డ్డారు. కాబ‌ట్టి వెంట‌నే రాజీనామా చేయాల‌ని అన్నారు.

రామ్మోహ‌న్ చ‌ద‌వింది ఇంజ‌నీరింగ్ అని ఆయ‌నకు ఎలాంటి అనుభ‌వం లేకుండా ఏవియేష‌న్ మినిస్ట్రీని ఎలా న‌డిపిస్తార‌ని అన్నారు. దేశంలోని 486 విమానాశ్ర‌యాలు ఉన్నాయ‌ని, విమాన రంగం చాలా న‌ష్టాల్లో ఉంద‌ని చెప్పారు. కాబ‌ట్టి రామ్మోహ‌న్ నాయుడు ఒక్క‌రోజు కూడా ఏవియేష‌న్ మంత్రిగా ఉండ‌టానికి వీలు లేద‌ని అన్నారు. పార్ల‌మెంట్ లో ఎంతో మంది ఏవియేష‌న్ లో అనుభ‌వం ఉన్నవాళ్లు ఉన్నార‌ని చెప్పారు. ఏవియేష‌న్ రంగం అనేది చాలా కీల‌క‌మైన రంగం అని దానిని న‌డిపించ‌డం అంత సుల‌భం కాద‌ని అన్నారు. 1991 నుండి త‌న‌కు సొంతంగా విమానాలు ఉండ‌టం వ‌ల్ల వాటిని నిర్వ‌హించ‌డం ఎంత క‌ష్ట‌మో త‌న‌కు తెలుసు అని చెప్పారు.

Next Story