- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Youtuber Jyoti Malhotra::ఉగ్రదాడికి ముందు పహల్గామ్‌కు జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రా.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ట్రావెల్ యూట్యూబర్ అయిన ఈ హర్యానా మహిళ పాకిస్థాన్ ఐఎస్ఐకి భారత ఆర్మీ సమాచారం అందిస్తూ దేశద్రోహానికి పాల్పడింది.

దిశ, వెబ్ డెస్క్: జ్యోతి మల్హోత్రా.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ట్రావెల్ యూట్యూబర్ అయిన ఈ హర్యానా మహిళ పాకిస్థాన్ ఐఎస్ఐకి భారత ఆర్మీ సమాచారం అందిస్తూ దేశద్రోహానికి పాల్పడింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జ్యోతికి ఐదు రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా జ్యోతి మల్హోత్రకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత రక్షణవ్యవస్థకు సంబంధించి ఐఎస్ఐ జ్యోతి నుండి కీలక విషయాలను సేకరించినట్టు తెలుస్తోంది. దీనికోసం ఐఎస్ఐ జ్యోతికి భారీగా నగదు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.
డబ్బుతో పాటూ అక్కడ జ్యోతి వీఐపీ ట్రీట్మెంట్ అందుకున్నారు. 2023 జ్యోతి పాకిస్థాన్ హైకమిషన్ కు వెళ్లి భారత రక్షణ వ్యవస్థకు సంబధించిన కీలక విషయాలను లీక్ చేసింది. తన ఇన్ స్టా అకౌంట్‌లో పాక్‌లో పర్యటించిన వీడియోలను జ్యోతి షేర్ చేసింది. అంతే కాకుండా ఆ దేశంపై ఎంతో ప్రేమ కురిపిస్తూ జ్యోతి వీడియోలు చేసింది. సాధారణంగా పాకిస్థాన్‌లో సాధారణ వ్యక్తులు పర్యటించాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి కానీ జ్యోతి నిర్దేశిత ప్రదేశాల్లోనూ పర్యటించింది.
అక్కడ పర్యటించేందుకు ఐఎస్ఐ అధికారే ఆమెకు పాస్ పోర్టు ఇవ్వడంతో పాటూ శిక్షణ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జ్యోతి మల్హోత్ర పహల్గామ్ దాడికి కూడా సహకరించిందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం పహల్గామ్ ఉగ్రదాడికి సరిగ్గా 3 నెలల క్రితం ఆమె ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో పర్యటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆమె సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. రద్దీగా ఉండే పహల్గామ్ సమాచారం జ్యోతి మల్హోత్రానే పాక్ ఐఎస్ఐకి ఇచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.






