నన్ను పెళ్లి చేసుకుంటావా? పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ ఐఎస్ఐకి గూఢ‌చ‌ర్యం చేసిన యూట్యూబ‌ర్ జ్యోతిమ‌ల్హోత్ర ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమెను అధికారులు విచారిస్తున్నారు.

నన్ను పెళ్లి చేసుకుంటావా? పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఐఎస్ఐకి గూఢ‌చ‌ర్యం చేసిన యూట్యూబ‌ర్ జ్యోతిమ‌ల్హోత్ర ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమెను అధికారులు విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ఫోన్, డైరీ స్వాధీనం చేసుకుని వాటిని ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ్యోతి మ‌ల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హ‌స‌న్‌తో నిరంతరం టచ్ లో ఉన్నట్టు తేలింది. ఇక అతడితో చేసిన చాటింగ్‌లో సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ చాటింగ్‌లో జ్యోతి మల్హాత్రా తనను పాకిస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలని కోరినట్టు హసన్ తెలిపాడు.

అంతే కాకుండా భారత ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని జ్యోతి హసన్‌కు షేర్ చేసినట్టు గుర్తించారు. కొన్ని విషయాలను కోడ్ రూపంలో తెలిపినట్టు గుర్తించారు. అవి గూడచారి కార్యకలాపాలకు సంబంధించినవి అని నిర్దారించారు. అంతే కాకుండా జ్యోతికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉండగా అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమె లావా దేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇక జ్యోతితో పాటూ మరికొందరిని కూడా అధికారులు విచారిస్తున్నారు. విచారణ పూర్తైన తరవాత పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Next Story