- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Justice Varma: అలహాబాద్ హైకోర్టు జడ్జీ యశ్వంత్ వర్మపై అభిశంసన !
అలహాబాద్ హైకోర్టు జడ్జీ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు జడ్జీ యశ్వంత్ వర్మ (Yashwanth varma) ను పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు సెషన్‌లో వర్మపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనను తీసుకురావొచ్చని సన్నిహిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉన్నందున, ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నుంచి అనుమతి పొందడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగిస్తే అభిశంసన ద్వారా పదవి కోల్పోయిన మొదటి న్యాయమూర్తి కానున్నారు.
ఢిల్లీలోని వర్మ ఇంట్లో మార్చి నెలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన ఇంట్లో భారీగా కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. దీనిపై తీవ్ర వివాదం నెలకొనడంతో విచారణ చేపట్టడానికి సీజేఐ ముగ్గురు న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా సీజేఐకి నివేదిక అందజేసింది. వర్మను దోషిగా నిర్ధారించింది. అనంతరం ఈ నివేదికను సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలకు పంపించారు. వర్మపై అభిశంసన తీర్మనం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.






