రేపు సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-23 16:47:52  IST  )

భారతీయ న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

రేపు సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం నేటితో ముగియగా.. రేపు (సోమవారం) సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ సూర్యకాంత్ సుప్రీంకోర్టు సీజేఐ పదవిలో ఉండనున్నారు.

1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు సూర్యకాంత్. హిసార్ జిల్లాకోర్టులోనే న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై.. అక్కడి నుంచి సుప్రీంకోర్టు సీజేఐగా పదోన్నతి పొందారు.

జస్టిస్ సూర్యకాంత్ వృత్తిపరంగా అనేక ముఖ్యమైన తీర్పులిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుని సమర్థించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. అలగా వలసపాలకుల కాలం నాటి దేశద్రోహ చట్టం (సెక్షన్ 124A) వినియోగాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల బెంచ్ లోనూ ఉన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసు, ఎన్నికల పారదర్శకత, లింగ సమానత్వం, పీఎం సెక్యూరిటీ బ్రీచ్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. తీర్పులు ఇచ్చిన ధర్మాసనాలు, బెంచ్ లలో సూర్యకాంత్ ఒకరిగా ఉన్నారు. సీజేఐ గా ఆయన మరిన్ని చరిత్రాత్మక తీర్పులు ఇస్తారని, కీలక సంస్కరణలు చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.

Next Story