- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం.. హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ ఆ పదవిలో కొనసాగుతారు. సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న హర్యానా రాష్ట్రానికి చెందిన తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా హాజరయ్యారు.
Read More... జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
Next Story






