సుప్రీంకోర్ట్ కొత్త CJI గా జస్టిస్ సూర్యకాంత్ నియామకం

by Muthe.Rajitha |

సుప్రీంకోర్ట్ కొత్త CJI గా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు.

సుప్రీంకోర్ట్ కొత్త CJI గా జస్టిస్ సూర్యకాంత్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్ట్ కొత్త CJI గా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు. అయితే ప్రస్తుతం సీజేఐగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ ఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగుస్తుండటంతో.. కొత్త సీజేఐ నియామక ప్రకటన జరిగింది. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రపడటంతో కొత్త సీజేఐగా సూర్యకాంత్ నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్ జిల్లాలోని నర్నాండ్ ప్రాంతంలోని పెట్వార్ గ్రామంలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. 1981లో హిసార్‌లోని గవర్నమెంట్ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందాడు. దశాబ్దాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ, 2011లో కురుక్షేత్ర యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా సాధించాడు. కాగా జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు అనగా 14 నెలలకాలంపాటు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

Next Story