- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం..!
ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం–2021 పై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం–2021 పై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గతంలో కోర్టు కొట్టివేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ చట్టంగా తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులను పట్టించుకోకుండా కొత్త చట్టాలు తేవడం సరికాదని, పార్లమెంట్ కూడా న్యాయస్థానం తీర్పులను పక్కన పెట్టలేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. 2021లో ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం తీసుకురావడంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రైబ్యునల్ సహా పలు ట్రైబ్యునళ్లు రద్దు కావడంతో, మద్రాస్ బార్ అసోసియేషన్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
విచారణ సమయంలో కేంద్ర తరఫు న్యాయవాది కేసును వాయిదా వేయాలని, ఇది మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరగా, దీనిపై జస్టిస్ గవాయ్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా బెంచ్ నుండి తప్పించుకోవాలనుకుంటున్నారా? నేను పదవి విరమించే వరకు తీర్పు రావద్దనుకుంటున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించారు. చివరగా, ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టంలోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్రం కోర్టు తీర్పులను ఉల్లంఘించకూడదని, రాజ్యాంగపరమైన వ్యవస్థను గౌరవించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.






