- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొక్కిసలాటకు ఆర్సీబీ జట్టే కారణం.. జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ పరేడ్ (Victory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనతో కర్ణాటక ప్రభుత్వం (Government of Karnataka)పై పోలీసులు, ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సుమోటో కేసుగా తీసుకున్న కోర్టు.. జ్యుడీషియల్ కమిషన్ (Judicial Commission) ద్వారా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం మాజీ హైకోర్టు న్యాయమూర్తి మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో ఒక జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించింది.
ఈ కమిషన్ ఘటనకు సంబంధించిన లోపాలను, బాధ్యులను గుర్తించడానికి విచారణ జరిపింది. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ నివేదిక (Judicial Commission Report) ఇచ్చింది. విచారణలో విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు కారణమని తెలిపింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో పాటు.. కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చిన జ్యుడీషియల్ కమిషన్ తేల్చింది. ఈ నివేదికను కమిషన్ సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah)కు అందించింది.
- Tags
- RCB
- Kistampally






