రాహుల్ గాంధీ చేసింది రాజద్రోహం: జేపీ నడ్డా

by Gantepaka Srikanth |

ట్రంప్‌కు మోడీ భయపడ్డాడు. అందుకే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాడు అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

రాహుల్ గాంధీ చేసింది రాజద్రోహం: జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రంప్‌కు మోడీ భయపడ్డాడు. అందుకే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాడు అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) స్పందించారు. "రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని అవమానించారు. సైన్యాన్ని అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరం మాత్రమే కాదు, భారత సైన్యానికి, 140 కోట్ల మంది భారతీయులకు తీవ్ర అవమానం. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం కంటే తక్కువ కాదు అని నడ్డా అన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ అణ్వాయుధ యుద్ధంగా మారకుండా ‘డీల్‌’ కుదిర్చినందుకు గర్వపడుతున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బుల్లెట్లను కాకుండా వాణిజ్యాన్ని ఉపయోగించడం ద్వారా యుద్ధాన్ని ఆపినట్టు చెప్పారు. ప్రస్తుతం అంతా బాగుందని అన్నారు.

Next Story