- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jp nadda: ఉగ్రదాడులపై కాంగ్రెస్ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా (Jp nadda) మాట్లాడుతూ.. గత పదేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో తప్ప దేశంలో మరే ఇతర ఉగ్రవాద దాడి జరగలేదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కఠినంగా వ్యవహరించారని తెలిపారు. ఢిల్లీ, వారణాసి, ముంబైలలో ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తు చేశారు. 2008లో భారీ ఉగ్రదాడి జరిగితే అనంతరం జరిగిన షాంగై కోఆపరేషన్ సదస్సులో దాని గురించి ప్రస్తావించలేదన్నారు. కానీ పహెల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు.
ప్రపంచ ఎజెండాలో ఉగ్రవాదం: జైశంకర్
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా ఉగ్రవాదాన్ని ప్రపంచ ఎజెండాలో ఉంచారని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. బ్రిక్స్, ఎస్సీఓ, క్వాడ్, ఇతర ద్వైపాక్షిక సమావేశాల్లోనూ టెర్రరిజం ప్రస్తావన తీసుకొచ్చామన్నారు. సిందూ జలాల ఒప్పందంపై స్పందిస్తూ.. ఒక దేశం తన ప్రధానమైన నది నీటిని మరొక దేశంలోకి ప్రవహించడానికి అనుమతించిన అటువంటి ఒప్పందం ప్రపంచంలో ఏదీ ఉండబోదని తెలిపారు. దీనికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అప్పటి ప్రభుత్వం తన సొంత దేశ ప్రయోజనాలను విస్మరించి పొరుగు దేశ ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకుందని ఆరోపించారు. కాల్పుల విరమణ సందర్భంగా మోడీ, ట్రంప్ మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదని మరోసారి స్పష్టం చేశారు.






