- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్‌పై జర్నలిస్టుల యుద్ధం.. ఇల్లినోయి కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు
తమ అనుమతి లేకుండా వాయిస్ రికార్డింగ్‌లు ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకుంటోందని ఆరోపిస్తూ గూగుల్‌పై జర్నలిస్టుల బృందం ఇల్లినోయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక టెక్ దిగ్గజం గూగుల్ (Google) వరుసగా చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా తమ వాయిస్ (Voice)లు, కంటెంట్‌ను తమ పర్మీషన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకుంటోందని ఆరోపిస్తూ ఓ జర్నలిస్టుల బృందం గూగుల్‌పై ఇల్లినోయి ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది చేసింది. అయితే, గూగుల్ ఏఐ టెక్నాలజీ Gemini Live, గూగుల్ అసిస్టెంట్ వంటి వాటిని మరింత సహజంగా మార్చడానికి, జర్నలిస్టులు, పోడ్‌కాస్టర్లు, ఆడియో బుక్ నెరేటర్ల వాయిస్ రికార్డింగ్‌లను అక్రమంగా సేకరించి వాడుకుందని పిటిషనర్లు పేర్కొన్నారు. గూగుల్‌కు వ్యతిరేకంగా దావా వేసిన వారిలో పులిట్జర్ ప్రైజ్ గ్రహీతలు యోహాన్సే లాకోర్, అలిసన్ ఫ్లవర్స్‌తో పాటు ప్రముఖ చికాగో జర్నలిస్ట్ కరోల్ మారిన్ వంటి హేమాహేమీలు ఉన్నారు.
యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన..
ఇల్లినోయి బయోమెట్రిక్ ప్రైవసీ లా (Biometric Privacy Law), రైట్ ఆఫ్ పబ్లిసిటీ చట్టాలను గూగుల్ తుంగలో తొక్కిందని బాధిత జర్నలిస్టులు ఆరోపించారు. ప్రొఫెషనల్‌గా రికార్డ్ చేసిన వేలాది గంటల ఆడియోను సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా గూగుల్ తన ఏఐ సిస్టమ్స్ కోసం వాడుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గూగుల్ ఇంటర్నెట్ నుంచి వాయిస్ రికార్డింగ్‌లను స్క్రాప్ (Scrap) చేసి, తద్వారా తన వాయిస్ ఏఐ మోడళ్లను మరింత శక్తివంతం చేస్తోందని వారు ఆరోపించారు. ముఖ్యంగా స్టూడియో క్వాలిటీతో ఉన్న సింగిల్ స్పీకర్ రికార్డింగ్‌లను గూగుల్ లక్ష్యంగా చేసుకుందని వారు వాదిస్తున్నారు. టెక్ కంపెనీలు తమ అనుమతి లేకుండా తమ కంటెంట్‌ను వాడుకుంటున్నాయని రచయితలు, న్యూస్ అవుట్‌లెట్లు వేస్తున్న వరుస కేసుల్లో ఇది ఒకటి కావడం విశేషం. జనవరిలో మాజీ ఎన్పీఆర్ (NPR) హోస్ట్ డేవిడ్ గ్రీన్ కూడా గూగుల్‌పై ఇలాంటి పిటిషనే వేశారు. అదేవిధంగా వాయిస్ యాక్టర్ల బృందం కూడా లోవో (Lovo) అనే స్టార్టప్ కంపెనీపై న్యూయార్క్‌లో న్యాయపోరాటం చేస్తోంది.






