- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాడిలో జర్నలిస్టులు మృతి.. వెల్లడించిన ఇరాన్ ఎంబసీ
ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు భారత్ లోని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు భారత్ లోని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో పలువురు జర్నలిస్టులు మరణించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రిమినల్ యాక్ట్ కు పాల్పడిందని ఎక్స్ లో పేర్కొంది. భారత మీడియా ఈ చర్యల్ని ఖండిస్తుందని భావిస్తున్నట్లు ఇరాన్ ఎంబసీ ఆ పోస్టులో పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు జర్నలిస్టులు, మీడియా కార్మికులు మరణించడం వల్ల, మీడియా స్వేచ్ఛకు కోలుకోని దెబ్బ తగిలిందని ఎంబసీ పేర్కొంది.
ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలను వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంస్థలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల మృతి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ ఎంబసీ ప్రకటనలో పేర్కొన్నట్లుగా.. ఈ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాయి.






