- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా జర్నలిస్ట్‌పై దాడి.. క్రూరాతి క్రూరంగా హింసించి మరీ.. వీడియో వైరల్!
మహారాష్ట్ర పూణె సమీపంలోని నదీ తీరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్‌పై రిపోర్టింగ్ చేస్తుండగా.. జర్నలిస్ట్ స్నేహా బర్వేపై దాడికి దిగారు వ్యాపారవేత్త పాండురంగ్ సఖారామ్ మోర్దే అండ్ గ్యాంగ్. సహాయం కోసం కేకలు వేస్తున్నా కనికరించకుండా..

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణె సమీపంలోని నదీ తీరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్‌పై రిపోర్టింగ్ చేస్తుండగా.. జర్నలిస్ట్ స్నేహా బర్వేపై దాడికి దిగారు వ్యాపారవేత్త పాండురంగ్ సఖారామ్ మోర్దే అండ్ గ్యాంగ్. సహాయం కోసం కేకలు వేస్తున్నా కనికరించకుండా.. స్పృహ కోల్పోయే వరకు రాడ్‌తో బాదినట్లు తెలుస్తోంది. గుండాలు ఆమెను సమీపించి దాడి చేస్తున్న వీడియో ఫుటేజ్ బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ప్రధాన నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కాగా ఈ విషయంపై భారీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ అమలుపై ఆందోళనలను లేవనెత్తుతోంది. దీన్ని పత్రికా స్వాతంత్ర్యంపై దాడిగా ఖండిస్తూ.. చట్టం, శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు.
Next Story






