ప్రధాని విదేశీ పర్యటన.. జోర్డాన్‌‌లో ఘన స్వాగతం పలికిన ప్రధాని జాఫర్ హాసన్

by Ramesh Naini |   (  Updated:2025-12-15 13:42:48  IST  )

భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (సోమవారం) జోర్డాన్‌లోని అమ్మాన్‌లో అడుగుపెట్టారు.

ప్రధాని విదేశీ పర్యటన.. జోర్డాన్‌‌లో ఘన స్వాగతం పలికిన ప్రధాని జాఫర్ హాసన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (సోమవారం) జోర్డాన్‌లోని అమ్మాన్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జోర్డాన్ ప్రధాన మంత్రి జాఫర్ హసన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అలాగే భారత్ ఎన్ఆర్ఐలు సైతం నేషనల్ ఫ్లాగ్స్‌తో ప్రధానికి వెల్‌కమ్ చెప్పారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరచడం కోసం ప్రధాని జోర్డాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జోర్డాన్‌ రాజు అబ్దుల్లా ఇబ్న్‌ అల్‌ హుస్సేన్‌, ప్రధాని జాఫర్‌తో మోడీ భేటీ అయ్యారు. కాగా, ఈ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వివిధ దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. రేపటి వరకు ప్రధాని జోర్డాన్‌లో ఉంటారు. కీలక చర్చల అనంతరం ఒమన్, ఇథియోపియా దేశాల్లో వెళ్లనున్నారు. ఈ దేశాల్లో ప్రముఖులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారు.

Next Story