పొగతాగడం కంటే ఉద్యోగమే డేంజర్.. టెక్కీకి డాక్టర్ షాకింగ్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |

సిగరెట్ కంటే ఉద్యోగమే ఆరోగ్యానికి డేంజరని తన డాక్టర్ చెప్పాడని ఓ టెక్కీ బ్లైండ్ యాప్ లో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది

పొగతాగడం కంటే ఉద్యోగమే డేంజర్.. టెక్కీకి డాక్టర్ షాకింగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పొగత్రాగడం కంటే ఉద్యోగమే ఆరోగ్యానికి డేంజర్ అని తన డాక్టర్ చెప్పాడని ఓ టెక్కీ బ్లైండ్ యాప్ లో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ఉద్యోగం వల్ల కలిగే ఒత్తిడి, సిగరెట్ స్మోకింగ్ కంటే ప్రమాదమని హెచ్చరించినట్లుగా అతను పేర్కొన్నాడు. సదరు ఉద్యోగి ఐదేళ్లుగా ఒక డాక్టర్ ను సంప్రదిస్తున్నాడు. ఇటీవల కాలంలో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆందోళన తగ్గేందుకు మందులు ఇచ్చిన డాక్టర్.. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడాన్ని కూడా గమనిచారని తన పోస్టులో చెప్పుకొచ్చాడు.

ఉద్యగంలో భరించలేని ఒత్తిడి వల్లే జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఆరోగ్యం కుదుటపడాలంటే వెంటనే ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకోవాలని సూచించినట్లు తెలిపాడు. ఈ పోస్ట్ ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. అతను చెప్పింది కరెక్టేనంటూ చాలామంది టెకీలు మద్దతు తెలుపుతున్నారు. ఓ యూజర్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. తన వయసు 32 ఏళ్లు అని, డబ్బున్నా ఆరోగ్యం లేదని వాపోయాడు. పని ఒత్తిడితో తన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు చెప్పారు. హెల్త్ కంటే ఏదీ ఇంపార్టెంట్ కాదని, వెంటనే బ్రేక్ తీసుకోవాల్సిందిగా టెకీకి సూచించాడు.

ఇక ఒత్తిడి పెడితే.. కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై అనారోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గచూపేలా చేస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, జీవక్రియ సమస్యలు తలెత్తుతాయి.

Next Story