- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా టార్గెట్‌గా సెర్చ్ ఆపరేషన్.. ఆ అడవిని చుట్టుముట్టిన బలగాలు
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కోటి రూపాయల రివార్డు కలిగిన మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం బాబుదేరా అటవీ ప్రాంతంలో కోబ్రా (CoBRA) బెటాలియన్ జవాన్లు, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల ముఠా ఎదురైంది. భద్రతా బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ముమ్మరమైన ఆపరేషన్..
దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31, 2026 గడువు ముగిసిన నేపథ్యంలో, మిగిలి ఉన్న కొద్దిమంది సాయుధ దళాలను తుడిచిపెట్టేందుకు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పార్లమెంటులో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ అడవుల్లో దాదాపు 3,000 మందికి పైగా సిబ్బందితో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం.






