Jharkhand: జార్ఖండ్‌లో ఏనుగుల గుంపు బీభత్సం.. నాలుగు రోజుల్లో ఏడుగురు మృతి

by B.Srinivas |

జార్ఖండ్‌లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని గుమ్లా, సిమ్దేగా జిల్లాల్లో జనావాసా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి.

Jharkhand: జార్ఖండ్‌లో ఏనుగుల గుంపు బీభత్సం.. నాలుగు రోజుల్లో ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ (Jharkhand) లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని గుమ్లా (Gumla), సిమ్దేగా (Simdhegaa) జిల్లాల్లో జనావాసా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. దీంతో ఏనుగుల దాడిలో గత నాలుగు రోజుల్లోనే ఏడుగురు మృతి చెందారు. ఆదివారం గుమ్లా జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు మరణించగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 45 ఏళ్ల జేమ్స్ కుజుర్ అనే వ్యక్తి అడవిలోకి వెళ్లగా ఏనుగులు దాడి చేసినట్టు వెల్లడించారు. మరో సంఘటనలో 73 ఏళ్ల క్లైమేట్ ఎక్కా అనే వ్యక్తిని అతని ఇంటి సమీపంలో ఓ అడవి ఏనుగు తొక్కి చంపింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే ఏనుగు జర్మన్ గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేసింది. అంతుకుముందు జరిగిన ఘటనల్లో మరో ఐదుగురు మరణించారు.

గుంపు నుంచి తప్పిపోయిన మూడు నాలుగు ఏనుగులు గుమ్లా, సిమ్దేగా జిల్లాల్లోని నివాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లను సైతం ధ్వంసం చేస్తుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికాకారులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఏనుగులకు తిరిగి అడవిలోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story