సోనియాతో జార్ఖండ్ సీఎం సోరెన్ దంపతుల భేటీ

by Ramesh N |
సోనియాతో జార్ఖండ్ సీఎం సోరెన్ దంపతుల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు భేటీ అయ్యారు. శనివారం తన భార్య కల్పనతో కలిసి, హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలోని సోనియా జనపథ్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ సమావేశం తాజాగా జార్ఖండ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంపై హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాయని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ.. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమెను కలవలేదని, ఈ నేపథ్యంలోనే ఆమెను కలిసేందుకు వచ్చానని స్పష్టంచేశారు.

ఎన్నికలపై చర్చించలేదు

జార్ఖండ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి సోనియాతో చర్చించారా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి సోరెన్ సమాధానం చెబుతూ.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన చర్చలు కొనసాగుతాయి.. తాజాగా ఎన్నికల గురించి ఎటువంటి చర్చ జరగలేదు.. అని సోరెన్ స్పష్టంచేశారు.

జార్ఖండ్ సీఎంగా తిరిగి పగ్గాలు చేపట్టిన హేమంత్ సోరెన్ బీజీపీ‌పై గుస్స మీద ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీని మట్టి కరిపించాలని ఫిక్స్ అయ్యారు. ఐదు నెలలకు పైగా జైల్లో గడిపిన సోరెన్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

Advertisement

Next Story