జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్

by Gantepaka Srikanth |

జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సెంటైల్ వచ్చింది. తెలంగాణకు చెందిన విద్యార్థి వివన్ శరద్ మహీశ్వరీ, ఏపీకి చెందిన జి. నరేంద్ర బాబు, పసల మోహిత్‌కు 100 పర్సెంటైల్ వచ్చింది.

జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
X

దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్స్ ఫలితాలు(JEE Mains Result 2026) విడుదల అయ్యాయి. ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సెంటైల్ వచ్చింది. తెలంగాణకు చెందిన విద్యార్థి వివన్ శరద్ మహీశ్వరీ, ఏపీకి చెందిన జి. నరేంద్ర బాబు, పసల మోహిత్‌కు 100 పర్సెంటైల్ వచ్చింది. ఓబీసీ విభాగంలో టాపర్‌గా నరేంద్ర బాబు నిలిచారు. పేపర్ 1, పేపర్ 2 పరీక్షల్లో ఇవాళ కేవలం పేపర్ 1 ఫలితాలు మాత్రమే విడుదల చేశారు. పేపర్ 2 ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో బీఈ/బీటెక్ అడ్మిషన్ల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలను ఈ జనవరి 21,22,23, 24,28 తేదీల్లో నిర్వహించింది. ఇందులో ఉత్తీర్ణులైన వారి కోసం ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను తెలుసుకోవాలంటే ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://jeemain.nta.nic.in/ లోకి వెళ్లాలి. అక్కడ అభ్యర్థులు వారి అప్లికేషన్ నంబర్, లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉపయోగించి స్కోర్ కార్డుల్ని ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటిని ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

Next Story